Pages

Sunday, 14 September 2025

D.El.Ed TEXT BOOKS 1st year

lm

D.El.Ed TEXT BOOKS


FIRST SEMESTER & SECOND SEMESTER :

NAME OF THE TITLEPAPER CODETELUGU MEDIUMENGLISH MEDIUM
Pedagogy of Mother Tongue/First Language at Primary Level101 & 201



Pedagogy of Mathematics at Primary Level102 & 202
Pedagogy across Curriculum & ICT Integration103 & 203
Childhood & the Development of the child104 & 204
Society, Education & Curriculum



105
Early childhood care & Education 



106
Towards Self- Understanding 107 & 405

Proficiency in English



108 


Art & Cultural Education




 205


Friday, 5 September 2025

AP TET DSC 3 వ తరగతి TELUGU

lm
AP TET DSC 3 వ తరగతి TELUGU

3 వ తరగతి
నూతన తెలుగు వాచకం


◆తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ.
◆శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
◆శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది.
◆శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరే అనంతం.
◆తల్లీ భారతి వందనం గేయ రచయిత- దాశరథి కృష్ణమాచార్యులు.
◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారు.
◆దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరు యాత్రా స్మృతి.
◆లియోటాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు.
◆లియోటాల్ స్టాయ్ యుద్ధం శాంతి, అన్నాకెరినీనా లాంటి రచనలు చేశారు.
◆పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవారు.
◆పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు.
◆పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య.
◆ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరకు వెళ్ళింది.
◆జింక కథ ఈసఫ్ కథల్లోనిది.
◆ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి.
◆ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల నాటివి.
◆’మంచిబాలుడు’ పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది.
◆మంచిబాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందింది.
◆మంచిబాలుడు గేయ కథ రచయిత ఆలూరి బైరాగి,
◆మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి,
◆ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ లభించింది.
◆ఆలూరి రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం మొదలైనవి.
◆కలపండి చేయి చేయి పాట రచయిత- శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి,
◆ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి,

◆రాయప్రోలు సుబ్బారావు గారికి అభనవ నన్నయ, నవ్య కవితా పితామహుడు అనే బిరుదులు ఉన్నాయి.
◆’తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, వనమాల’ రాయప్రోలు సుబ్బారావు రచనలు
◆భారత ప్రభుత్వం సుబ్బారావు గారిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
◆’ఏ దేశమేగినా, ఎందుకాలిడినా’ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు.
◆1893 సెప్టెంబరు 11వ తేదీన షికాగోలో కొలంబస్ హాలులో సర్వమత మహాసభలో స్వామి వివేకానందుడు చక్కని ఉపన్యాసం ఇచ్చారు.
◆”ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి” అని వివేకానందుడు అన్నారు.
◆’సాయం’ ఒక అనువాద కథ.
◆జాక్కోప్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి, కథకుడు, నవలారచయిత.
◆”అమ్మా! అటుచూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది” అన్నాడు రవి.
◆సాయం పాఠంలో ఇతివృత్తం పరోపకారం (భూతదయ).
◆తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి.
◆”బాపూజీ! మీరు మట్టిలో మాణిక్యాలు వెలికి తీయగలరు. అందువల్లనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి” అని బాపూజీ పాదాలను స్పృశించారు మహాదేవ్ జీ.
◆కరుణశ్రీ పిల్లలకోసం తెలుగుబాల శతకం రచించారు.
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి కరుణశ్రీగా ప్రసిద్ధులు.
◆’జమదగ్ని’ అనే కలం పేరుతో చెరుకుపల్లి జమదగ్నిశర్మగారు రచనలు చేశారు.
◆పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా జమదగ్నిగారు కథలను రాశారు.
◆కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉన్నది.
◆’చూడాలనుకోవాలే గానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. వినాలనుకోవాలేగానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే’ ఈ వాక్యాలు కొండవాగు పాఠంలోనివి.
◆’జననీ జనకుల గొలుచుట
◆తనయునకును ముఖ్యమైన ధర్మము జననీ’ పద్య పాదాలను శ్రీనాథుడు రచించాడు.

◆దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు.
◆దేవులపల్లి రచనలు – కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం.
◆అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు.
◆ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం.
◆నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది.
◆నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచే వారు.
◆పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం.
◆బుర్రకథ పితామహుడు షేక్ నాజర్.
◆నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి, 5న జన్మించారు.
◆నాజరు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చింది.
◆నాజర్ జీవిత కథకు ‘పింజారి’ అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు.
◆నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ,
◆కొండపల్లి బొమ్మల్ని ‘పొణికి’ కర్రతో తయారు చేస్తారు.
◆కృష్ణాజిల్లా కొండపల్లి కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి.
◆బంగారు పాపాయి పాట రచయిత మంచాళ జగన్నాథరావు.
◆’చూశావా! రాజా! ఈ యొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది’ అని తాత సంబరపడ్డాడు.
◆పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం.
◆పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులు.
◆గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు,
◆చింతా దీక్షితుల రచనలు – ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు మొదలైనవి.
◆చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహనరావు.
◆నండూరి రామ్మోహన్రావు రచించిన బాల గేయాల సంపుటి పేరు హరివిల్లు.
◆నండూరి రచనలు – నరావతారం, విశ్వరూపం. వీటి ద్వారా సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు.
◆వికటకవిగా పేరు పొందిన వారు తెనాలి రామకృష్ణుడు.
◆’ఢిల్లీ వెళదాం – రాజును చూద్దాం’ అని మేమే మేకపిల్ల అంది.
◆మేమే మేక పిల్ల పరస్పర సహకారం ఇతివృత్తానికి చెందిన కథ.
◆మే మే మేకపిల్ల కథ రచయిత ఆర్. శకుంతల,
◆తెలుగు తోట గేయ రచయిత- కందుకూరి రామభద్రరావు.
◆కందుకూరి రామభద్రరావు రచనలు లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి.
◆’బహుళ కావ్యములను పరికింపగా వచ్చు’ ఈ పద్యం వేమన రచించాడు.
◆వేమన 17-18 శతాబ్దాల కాలం నాటి కవి.◆సుమతి శతక కర్త బద్దెన, 13వ శతాబ్దం వాడు.
◆గువ్వల చెన్నడు 17-18 శతాబ్దాలకు చెందిన కవి, గువ్వల చెన్నా మకుటంతో శతకం రాశాడు.
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసి,
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి రచనలు- విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి.
◆తెలుగు బాల శతకకర్త – జంధ్యాల పాపయ్య శాస్త్రి,
◆దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి,
◆దువ్వూరి రచనలు – కృషీవలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి.
◆తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి,
◆తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు – తిరుమలమ్మ.
◆సుభద్రా కళ్యాణం రచించింది తాళ్ళపాక తిమ్మక్క
◆అందమైన పాట రచయిత- జి.వి. సుబ్రహ్మణ్యం.
◆తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసినవారు- జి.వి. సుబ్రహ్మణ్యంగారు.
◆జి.వి. సుబ్రహ్మణ్యంగారి రచనలు వీరరసం, రసోల్లాసం మొదలైనవి.
◆దిలీపుడి భార్య పేరు – సుదక్షిణాదేవి.
◆దిలీపుడి కుమారుడు రఘుమహారాజు.
◆”ఓ రాజా! నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేం ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు” అని దిలీపునితో దేవతలు పలికారు.
◆’మా వూరి ఏరు’ ప్రకృతివర్ణన ఇతివృత్తంగా సాగిన గేయం.
◆’మా వూరి ఏరు’ గేయ రచయిత- మధురాంతకం రాజారాం.
◆రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400లకు పైగా కథలు రాసిన రచయిత- మధురాంతకం రాజారాం.
◆ఉత్తమ ఉపాధ్యాయుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత మధురాంతకం రాజారాం.
◆పంటచేలు పాట రాసినది పాలగుమ్మి విశ్వనాథం.
◆పాలగుమ్మి విశ్వనాథం లలితసంగీతానికి ప్రచారం కల్పించారు.
◆’బుద్ధిబలం కథ’ – పంచతంత్ర కథలకు చెందింది.
◆’బుద్ధిబలం కథ’లో సింహం- కుందేలు పాత్రధారులు.
◆’తొలిపండుగ కథ’లో – “అబ్బా! పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో” అన్నాడు ఆనంద్.
◆అరే! భలే ఉందే ఉగాది పచ్చడి.. తియ్యతియ్యగా పుల్లపుల్లగా.. చేదుచేదుగా అంటూ లొట్టలు వేసుకుతిన్నాడు. శామ్యూల్.
◆ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది.
◆ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.
◆తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలిపేది పంచాంగం.

◆సంవత్సరాలు 60 ఉంటాయి. మొదటిది ప్రభవ, చివరిది – అక్షయ.
◆తెలుగు నెలలు 12. వాటిలో మొదటిది చైత్రం చివరిది ఫాల్గుణం.
◆’అందాల తోట’ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు.
◆’అందాల తోట’ అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు.
◆’నక్కయుక్తి’ అనే జానపద కథ రచయిత శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి.
◆జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రసామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు వీరి రచనలు

Wednesday, 20 August 2025

Primary Telugu projects

lm



Monday, 11 August 2025

ప్రైమరీ తెలుగు పుస్తక సమీక్ష

lm


 నిర్మాణాత్మక మదింపు  టూల్ -1 



 3,4,5 తరగతులకు ఉపయోగపడే తెలుగు పుస్తక సమీక్ష 

సమీక్ష - 1 ( విద్య కంటే వివేకం మేలు)



సమీక్ష -2 ( సుమతి - కుమతి )



Sunday, 10 August 2025

2 గోపాల్ తెలివి

lm

AP State Syllabus 

4వ తరగతి తెలుగు సమాధానాలు

 2 గోపాల్ తెలివి


Textbook Page No. 7

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 4th Class Telugu Solutions 2nd Lesson గోపాల్ తెలివి 1




ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి ?
జవాబు:
చిత్రంలో ఐదు గొట్టెలు, వల, వల పైన మేత, చెట్లు, గొయ్యి, ఎండు కొమ్మలు.


ప్రశ్న 2.
పై చిత్రాల ఆధారంగా కథను చెప్ప౦డి?
జవాబు:
అది ఊరి చివరి ప్రదేశం. పశువులకు చక్కటి మేత దొరికే ప్రదేశం. అక్కడికి రోజూ ఐదు గొట్టెలు మేత కోసం వస్తూ ఉంటాయి.

ఒకరోజు అవి – చక్కగా పరచిన కంబళి మీద – సిద్ధంగా ఉన్న ఆహారాన్ని చూసి తింటానికి సిద్ధపడ్డాయి. కానీ అందులో ఒక గొట్టె వద్దని, ఆపాయం పొంచి ఉందని – దాని కోసం ఆ కంబళి మీదకు వెళ్ళ వద్దని, వారించింది.
కాని మిగిలిన నాలుగు గొట్టెలు ఆమాటలు పెడ చెవిన పెట్టాయి. ఆనాయాసంగా దొరికిన ఆ ఆహారం కోసం ఆ కంబళి మీదకు వెళ్ళాయి. వాటి బరువుకు – కంబళి కింద వాటికోసం త్వా ఉన్న గొయ్యిలో పడిపోయాయి.

అప్పుడు బాధపడుతూ…. ఆ నాలుగు గొట్టెలు వద్దని చెప్పిన ఆ ఐదో గొట్టెతో ఎలాగొలా రక్షించు మిత్రమా! అని కోరాయి.
తెలివైన ఆ ఐదో గొట్టె….. గబాగబా ఎక్కడినుంచో…కొన్ని ఎండిపోయిన కొమ్మలను తెచ్చి ఆ గోతిలో నుండి పై దాకా పడేసింది.
లోపల పడ్డ గొట్టెలు .ఎక్కటానికి అనుకూలంగా పడేసింది.
వెంటనే… లోపల నుండి ఒక్కొక్క గొట్టె గోతిలోంచి ఆ కంపమీదుగా గట్టెక్కాయి.. . .

నీతి:

‘1. ఆశ అనర్ధానికి కారణం.
2. కష్టపడకుండా వచ్చేది ఏదైనా నష్టానికి దారితీస్తుంది.
3. ఆలోచన లేని ఆచరణ అనర్ధదాయకం.
4. ఉపాయంతో అపాయాన్ని దాటగలం
5. ‘మంచి మిత్రుడే మనకు బలంAP
మంచి మిత్రుడే మనకు బలం.

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
ఢిల్లీ సుల్తానుకు వచ్చిన ఆలోచన ఏమిటి ?
జవాబు:
సామంత రాజులను రెండు ప్రశ్నలు అడగాలని ఢిల్లీ సుల్తాన్ కి ఆలోచన వచ్చింది.
అవి :

ఈ భూమి పొడవు ఎంత ? వెడల్పు ఎంత ?
ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి ?
ప్రశ్న 2.
సుల్తాను అడిగినది చిక్కు సమస్య. చిక్కు సమస్య అంటే ఏమిటి ? ఇలాంటివి మీరు విన్నవి చెప్ప౦డి.
జవాబు:
సూటిగా జవాబు చెప్పడానికి వీలులేని ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు. ఇలాంటివి మరికొన్ని :

రావి చెట్టుకు ఆకులెన్ని?
వర్షంలో నీమీద పడే చినుకులెన్ని?
ఎకరం పొలంలో ఎన్ని బియ్యపు గింజలు పండుతాయి. “
ఒక లారీలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి ?


ప్రశ్న 3.
‘గోపాల్ తెలివి’ కథను మీ సొంత మాటల్లో చెప్ప౦డి.
జవాబు:
ఒకసారి ఢిల్లీ సుల్తాన్ కి రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది. వెంటనే సామంత రాజులందరినీ పిలిపించాడు. సభ తీర్చాడు. వచ్చిన సభలోని సామంతరాజులని ” ఈ భూమి పొడవు, వెడల్పు ఎంత?” ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. అని రెండు ప్రశ్నలడిగాడు. ఆ ప్రశ్నలకు వారంతా ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకొని – కావాలనే ఈ చిక్కు సమస్య ఇచ్చాడనుకున్నారు.
అందరూ, సుల్తాన్ – ఈ ప్రశ్నలకు జవాబులు – పండితులతో చిర్చించి చెప్తామన్నారు. అందుకు సరే వెళ్ళమన్నాడు సుల్తాన్. రాజులంతా వారి పట్టణాలకు వచ్చారు.

సామంతరాజుల్లో ‘మాల్వారాజు’ – జయచంద్రుడు. తన రాజ్యంలో పండితులందరిని పిలిపించి – సుల్తాన్ అడిగిన ప్రశ్నలను వినిపించి జవాబు చెప్పమన్నాడు. పండితులందరూ ఖంగు తిన్నారు. ఇంతలో జయచంద్రుడి ఆస్థాన విదూషకుడు గోపాల్ – ఆ ప్రశ్నలు విని ఒక్క క్షణం ఆలోచించి- ‘రాజా! నన్ను సుల్తాన్ దగ్గరకు పంపండి. నేను చూసుకుంటాను’ అన్నాడు.
అందుకు జయచంద్రుడు – గోపాల్ లో ” ఇది తమాషా కాదు తలలు పోతాయి.” . అని హెచ్చరించాడు. – అయినా ఫరావాల్లేదు పంపమని కోరాడు గోపాల్ – రాజు గోపాలను సుల్తాన్ దగ్గరకు పంపాడు.

గోపాల్ సుల్తాన్ వద్దకు వెళ్ళి వందనం చేసి, తానెవరో ఎందుకొచ్చాడో చెప్పాడు. మహాప్రభూ! ఇంతటి చిక్కు ప్రశలకు జవాబు చెప్పాలంటే – బోలెడంత ధనమూ, సమయమూ ఖర్చు అవుతుంది. అని చెప్పాడు. వెంటనే సుల్తాన్ తగినంత డబ్బు ఇచ్చి సంవత్సరం గడువు ఇచ్చి పంపాడు. తగిన జవాబులతో రాకపోతే కఠినశిక్ష తప్పదన్నాడు.

డబ్బుతో తన పట్టణానికి వచ్చిన గోపాల్ రాట్నాల వాళ్ళని పిలిచి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు.
సంవత్సర కాలం పూర్తి కావచ్చింది. రాట్నం వాళ్ళు వడికిన దారం మొత్తం (16)

పదహారు బళ్ళకు ఎక్కించి – (25) పాతిక గొట్టెలను తీసుకుని సరిగ్గా గడువు. రోజున గోపాల్ సుల్తాన్ గారి ముందు ప్రత్యక్షమయ్యాడు.

ప్రభూ! ఈ ఎనిమిది బళ్ళ దారం – భూమి నిలువు కొలత – ఈ ఎనిమిది బళ్ళ దారం భూమి అడ్డకొలత – ఇహ ఈ పాతిక గొట్టెల వంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో! అవి నక్షత్రాలు. అని సుల్తాన్ గారి చిక్కు ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పాడు. ఆ జవాబులను సుల్తాన్ నవ్వుకొని గోపాల్ ని సన్మానించి పంపాడు. తిరిగి వచ్చి గోపాల్ తన రాజైన జయచంద్రకి జరిగినదంతా చెప్పాడు.

ఎంతటి అపాయమునైనా – ఉపాయంతో జయించవచ్చని నిరూపించాడు.

పదజాలం

అ) పాఠం చదవండి. పాఠంలోని గుణింతాక్షర పదాలను రాయండి.
ఉదా.
1. పొడుగు ________
_____________
జవాబు:
1. పొడుగు
2. ఆలోచన
3. రాజు
4. సమాధానాలు
5. ముఖాలు.
6. వేసిన
7. విదూషకుడు
8. ఉపాయంతో
9. విషయం
10. భూమినంతా
11. ఆకాశంలో
12. పాతిక

ఆ) పాఠం చదవండి. పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. వచ్చింది.
2. ఢిల్లీ
3. నిశ్శబ్దంగా
4. వాళ్ళు
5. చెప్పగలం
6. ఉన్న
7. పట్టణాలకు
8. సామంతుల్లో
9. చిక్కు
10. తప్పుడు
11. లెక్క
12. ఇక్కడికి

ఇ) పాఠం చదవండి. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. ఆశ్చర్యం
2. నిశ్శబ్దం
3. ఆలస్యం
4. ప్రభూ
5. దర్బారు
6. పూర్తి
7. ఇస్తున్నాను
8. నక్షత్రాలు
9. ప్రశ్న
10. నిశ్చింత
11. సుల్తాను
12. కూర్చున్నారు



పదాలు – అర్థాలు

దర్బారు = రాజసభ
విదూషకుడు = హాస్యగాడు
సామంతులు = రాజుకింద ఉండే చిన్న రాజులు

ఈ మాసపు గేయం


చూడగంటి


రాగం: బృందావని
తాళం : ఖండ

పల్లవి : కంటి నఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజనవరత్న కాంచనవేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె కంటి||

చ|| పావనంబైన పాప వినాశనము గంటి
కైవసంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి
కోవిదులు కొనియాడు కోనేరు గంటి |

చ|| పరమయోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి
తిరువేంకటాచలాధిపు చూడగంటి ||

కవి పరిచయం

కవి : తాళ్ళపాక అన్నమయ్య
కాలము : (9-5-1408 – 23-2-1503)
విశేషాలు : పద కవితా పితామహులు. 32వేల సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ఠ సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి.


ఈ మాసపు కథ 

విందు


ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. వాళ్ల తల్లి నక్షత్రం, వాళ్లు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదరు చూడసాగింది.
సూర్యుడు, వాయువు అక్కడ విందులో వడ్డించినదల్లా కడుపునిండా మెక్కారు. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సుష్టుగా బోంచేసారు. వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒకసారి కూడా గుర్తుకు రానేలేదు. కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మరచిపోలేదు. తన ముందుంచిన రుచికరమైన కొన్నింటిని తల్లికోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు. ఈ అని వాళ్లు విందు ముగించి ఇంటికి వెళ్లేసరికి అర్థరాత్రి దాటింది. అయినా తల్లి నక్షత్రం వాళ్లకోసం మేలుకునే ఉంది. బిడ్డలు ముగ్గురూ ఇంటికి రాగానే “ నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు?” అని అడిగింది ఆశగా.

అమ్మమాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడుతూ “అయ్యో! నీకోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్లు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా!” అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్క తల్లి గుండె కలుక్కుమంది. ఆమె వాయువు వైపు చూసింది. అతడు ఇలా సమాధానమిచ్చాడు. “నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా!” నేను సుష్టుగా భోంచేయడానికి వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. ఆమే వీడేం చెబుతాడో చూద్దామనికొని చంద్రుని వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు. “అమ్మా! నువ్వొక పళ్ళెం తీసుకురా! నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము” చంద్రుడి మాటలు విన్న చుక్క తల్లి హృదయం నిండిపోయింది.

చుక్కతల్లి తర్వాత సూర్యుడివైపు తిరిగి ఇలా శపించింది. ” నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకురానందుకు నువ్వు సిగ్గుపడాలి. నువ్వు వట్టి స్వార్థపరుడవి. కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టుగాక, నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవరూ చూడరుగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తిమీద గుడ్డయినా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు”.

తర్వాత చుక్క తల్లి వాయువువైపు చూస్తూ ఇలా శపించింది. “నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు. ఎండాకాలం నీ వడ సోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధ పెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు. నిన్నెవ్వరూ అభిమానించరుగాక!”

చివరన చుక్కతల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది. “బిడ్డా, విందు తింటున్నప్పుడు కూడా నన్ను మరువలేదు. తల్లిపట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన, అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా వుంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి, ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాకకోసం ప్రజలు నిరీక్షిస్తారు. –

కవి పరిచయం

కవి : సోదుం రామ్మోహన్
కాలము : 2.03.1939 – 12.11.2008
విశేషాలు పత్రికా రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేసారు. రెండు దశాబ్దాల పాటు ‘విశాలాంధ్ర’లో ఒక దశాబ్దం పాటు ‘ఉదయం’లో పని చేసారు.


AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 1 గాంధీ మహాత్ముడు

lm

AP State Syllabus 4th Class Telugu Solutions
Chapter 1 గాంధీ మహాత్ముడు

Textbook Page No. 1

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 4th Class Telugu Solutions 4th Lesson గాంధీ మహాత్ముడు 1

ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు వారేం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో వీపున చిన్న పిల్లవాడి ని కట్టుకుని గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్న వీరనారి, ఆమెతో యుద్ధం చేస్తున్న సైన్యం ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
స్వతంత్ర పోరాటం అయి ఉంటుంది. బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరిస్తూ చెల్లాచెదరు చేస్తున్న ఆమె, వీరనారి ఝాన్సీరాణి అయి ఉంటుంది.


ప్రశ్న 3.
మీకు తెలిసిన సమరయోధుల పేర్లు చెప్ప౦డి.
జవాబు:
సైరా నరసింహారెడ్డి, ఝాన్సీరాణి, లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బంకిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, గాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య మొదలగువారు….

Textbook Page No. 4

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది?
జవాబు:
గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కోసం బయలు దేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది.

ప్రశ్న 2.
స్వరాజ్యం అంటే ఏమిటి ?
జవాబు:
సొంత పరిపాలన, మనల్ని మనం పరిపాలించుకోవడం. పాలకులూ మనమే,,,, పాలితులు మనమే….

ప్రశ్న 3.
గాంధీ స్వాతంత్ర్య సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా! మీకు తెలిసిన కొన్ని స్వాతంత్ర్య నినాదాలు చెప్ప౦డి.
జవాబు:

  1. స్వరాజ్యం (స్వాతంత్ర్యమే) మా జన్మహక్కు – తిలక్
  2. జై హింద్ – సుభాష్ చంద్రబోస్
  3. మా కొద్దీ తెల్ల దొరతనం
  4. సత్యమేవ జయతే – గాంధీ
  5. పోరాడదాం – లేదా – చనిపోదాం (డు – ఆర్ డై) – గాంధీ
  6. దేశం వదిలిపోండి!…. (యూసఫ్ మెహార్లీ )
  7. వందేమాతరం …. (బకించంద్ర చట్టర్జీ )
  8. నాకు రక్తమివ్వండి – నేను స్వేచ్ఛను ఇస్తాను (సుభాష్ చంద్రబోస్)
  9. ఇంక్విలాబ్ జిందాబాద్ – ( భగత్ సింగ్ )

ప్రశ్న 4.
గడగడ వణకడం అంటే ఏమిటి ?
జవాబు:
భయపడిపోవడం.

ప్రశ్న 5.
గంట గణగణ మోగింది. ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణ మోగుతుంటాయో చెప్ప౦డి.
జవాబు:
దేవాలయాలలో, పాఠశాలలో, కళాశాలలో, ఆగ్నిమాపక వాహనం పై (ఫైర్ ఇంజన్) చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో మొదలగు చోట్ల మోగుతుంటాయి.

కవి పరిచయం

కవి: బసవరాజు అప్పారావు
కాలము : 13-12-1894 – 10-06-1933
విశేషాలు : భావకవి, గీత కర్త, జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. ‘బసవరాజు అప్పారావు గారి గేయాలు’ పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి.

పదాలు – అర్థాలు

స్వరాజ్యం : = సొంత పాలన
మోక్షం = విడుపు, విముక్తి
కంపించుట = వణుకుట
ప్రణవం = ఓంకారం
అధర్మం = అన్యాయం (ధర్మం కానిది)
స్వస్తి = శుభం

భావం

గాంధీ మహాత్మడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది గాంధీ స్వాతంత్ర్య సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది. జాతిపిత బోసినవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. బాపూజీ మాట్లాడినపుడు ఓంకారం వలె గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనెడి మోక్షము చేతికి చిక్కింది.

ఈ మాసపు గేయం : తేనెల తేటల మాటలతో

పల్లవి :

తేనెల తేటల మాటలతో

మన దేమాతనే కొలిచెదమా

భావం భాగ్యం కూర్చుకుని

ఇక జీవనయానం చేయుదమా

||తేనెల॥


చ|| 1)

సాగరమేఖల చుట్టుకొని

సురగంగ చీరగా మలచుకొని

గీతాగానం పాడుకోని

మనదేవికి యివ్వాలి హారతులు

||తేనెల॥

చ|| 2)
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
||తేనెల॥

చ|| 3)
ఎందరో వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలధనం
వారందరినీ తలచుకొని
మన మానస వీథిని నిలుపుకొని
||తేనెల॥


కవి పరిచయం

కవి : ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
కాలము : (29-5-1944 – 25-07-2019)
రచనలు : ‘అనుభూతి గీతాలు’
విశేషాలు : కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఈయన కవితా సంపుటి. లలితగీత కర్త. ఆకాశవాణిలో పని చేశారు.


ఈ మాసపు కథ : తెలివైన దుప్పి

బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చోని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన.

దుప్పి రానే వచ్చింది. కాని దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది. ఒక వైపు పండు తినాలని అనిపిస్తున్నది. కాని పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది.

వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి, నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందరయిపోతోంది. దుప్పి వెనక్కి వెళ్లి పోతుంఏదేమో, దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ.

కాని దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడుతాయి. అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు ‘కదా! ఏదో తిరకాసు ఉందని అర్థమయింది. చెట్టు మీద ఉన్న వేటగాణ్ణి చూసింది. కాని చూడనట్లే చెట్టుతో అన్నది. చెట్టూ! చెట్టూ! పండ్లు విసురుతున్నావేంటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరకి పండ్ల కోసం రాను, అంటూ వెనుదిరిగి పోబోయింది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా ఆరిచాడు. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు? రేపు నిన్ను వదిలేదు. లేదు.
వేటగాడు పూర్తిగా బయట పడి పోయాడు. మళ్లీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమై పోయింది. మోసగాళ్లుంటారు. వాళ్ల మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి.

Monday, 2 January 2017

Tips for teachers

          school 

ప్రపంచ 10 అత్త్యుత్తమ విద్యా వ్యవస్థల్లో భారత దేశం ఉందొ లేదో తెలుసుకోవాలని ఉందా?

   ప్రపంచ వ్యాప్తంగా “ విద్య “ అనేది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబదుతోంది . విద్య విషయం లో కొన్ని దేశాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తుండగా  మరికొన్ని దేశాలు వెనుకబడి ఉన్నాయి . ప్రతి దేశము వారి విద్యా వ్యవస్థ ఉత్తమమైనదనే  భావిస్తుంది. ప్రతి వ్యక్తి తమ దేశ విద్యా వ్యవస్థ  ప్రపంచం లో ఎన్నవ స్థానం లో ఉన్నదో తెలుసుకోవాలనే ఆసక్తి ని కలిగి ఉంటాడు.  అలాంటి వారికోసమే ఈ వ్యాసం .
PEARSON EDUCATION GROUP  ప్రతి సంవత్సరం కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని  వివిధ దేశాల విద్యా వ్యవస్థల పనితీరును అంచనా వేస్తోంది.  SOCIAL PROGRESS IMPERATIVE  ప్రపంచ వ్యాప్తంగా ADULT LITERACY RATE, PRIMARY SCHOOL ENROLLMENT,SECONDARY SCHOOL ENROLLMENT, WOMEN’S MEAN YEARS IN SCHOOL  అంశాలను ప్రాతిపదికగా తీసుకొని  వివిధ దేశాలకు ర్యాంక్ లను ఇవ్వడం జరిగింది.  2015/16  సంవత్సరం లో టాప్ 10 దేశాలివే.


     ఈ ఫలితాలను చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. చాలా మంది  USA టాప్ పోసిషన్ లో ఉంటుందని భావిస్తారు. కాని  దక్షిణ కొరియా అగ్రస్థానం లో ఉండటం గమనించవచ్చు.  USA  యూరోపియాన్ దేశాల కంటే దిగువున 14 వ స్థానం లో ఉంది . మనదేశం టాప్ 34 లో  కూడా లేకపోవడం జరిగింది. 
జపాన్ మరియు దక్షిణ కొరియాలు మొదటి స్తానం కొరకు  పోటీబడ్డాయి. దక్షిణ కొరియాలో విద్యార్తులు ఒక్కోసారి వారానికి 7 రోజులు పాటశాలకు హాజారవుతారు. అంతే కాకుండా వీరి అక్షరాస్యత 97.9 శాతం. 2012  లో మొదటి స్థానం లో ఉన్న  FINLAND  2015  నాటికి 5  వ స్థానానికి పడిపోయింది .



ప్రపంచం లో ఏ దేశ ఉపాధ్యాయులు అత్యధిక వేతనం పొందుతున్నారో మీకు తెలుసా?

ప్రపంచం లో ఏ దేశంలో నైనా  ఉపాధ్యాయుల వేతనాలు మిగితా డిపార్టుమెంట్  ఉద్యోగులతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.అయినప్పటికీ మంచి నైపుణ్యం కల ఉపాధ్యాయులకు చక్కటి వేతనం ఎప్పటికి అందుబాటులో ఉంటుంది. క్రింది 10 దేశాలు  వార్షిక సరాసరి  వేతనం ఆధారంగా  వరుస క్రమంలో ఇవ్వబడినవి . ఇవి కేవలం అంచనాలు మాత్రమే.
10. దక్షిణ కొరియా :
సరాసరి వార్షిక వేతనం  $48100.  ఈ అసియా దేశం టీచర్లకు చక్కటి వేతనాలను అందిస్తోంది .  యునివర్సిటి మరియు అన్నిరకాల విద్య సంస్థల్లో చక్కటి అవకాశాలు కలవు.
9. ఆస్ట్రేలియా :

సరాసరి వార్షిక వేతనం $48900. ఆస్ట్రేలియా లో ఉపాధ్యాయులకు  వేతనం వారి వారి category బట్టి,  ఎక్స్‌పీరియన్సు ను బట్టి మారుతుంటాయి. అంతే కాకుండా ఆస్ట్రేలియా లో వివిధ ప్రాంతాలలో వివిధ రకాల విద్య వ్యవస్థలు అమలులో ఉన్నాయి.
8.బెల్జియం :
సరాసరి వార్షిక వేతనం $49100. ఇతర యురోపియన్ దేశాలతో పోలిస్తే బెల్జియం లో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ . అంతే కాకుండా బోనస్ మరియు overtime pay  వంటి విషయాలలో కూడా ఎక్కువే.
7.డెన్మార్క్ :
సరాసరి వార్షిక వేతనం $53000.  డెన్మార్క్ లో ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయ పనివేలలను పెంచినప్పటికీ చక్కటి వేతనాలను అందిస్తోంది. మరియు ఇక్కడి పౌరులకు  అనేక ప్రతిఫలాలను ఇక్కడి ప్రభుత్వాలు అందిస్తాయి.
6.ఐర్లాండ్ :
సరాసరి వార్షిక వేతనం $54900.  ఐర్లాండ్ ఉపాధ్యాయులు ఎంతో కాలం నుండి అత్యధిక వేతనాలు పొందుతున్నారు. మరియు ఇక్కడి విద్యావ్యవస్థ కు , ఉపాధ్యాయులకు ఎంతో మంచి పేరు కలదు.
5. కెనడా:
సరాసరి వార్షిక వేతనం $56400.  ఇక్కడ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడు పెరుగుతుండడంతో అదే స్థాయిలో ఉపాధ్యాయుల వేతనాలు క్రమముగా పెరుగుతున్నాయి . ఈ దేశంలో ఉపాధ్యాయులకు మంచి డిమాండ్ ఉంది .
4.నెదర్లాండ్:
సరాసరి వార్షిక వేతనం  $ 59800.   ఇక్కడి ఉపాధ్యాయులు ప్రైవేటు విద్య సంస్థల్లో అత్యధిక వేతనాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి .
3. జర్మనీ:
సరాసరి వార్షిక వేతనం  $64200.  ఇక్కడి ఉపాధ్యాయులకు అనేక అవకాశాలు కలవు . చక్కటి వేతనం తో పాటు  వసతి సదుపాయాలూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడతాయి.
2. స్విట్జర్లాండ్:
సరాసరి వార్షిక వేతనం $ 68800.  ప్రపంచం లో అత్యధిక ఖర్చు తో కూడిన పాఠశాలలను  ఈ దేశం కలిగి ఉంది . తద్వారా అక్కడి ఉపాధ్యాయులకు అధిక వేతన ప్రయోజనాలను పొందుతున్నారు.
1.లక్సెంబర్గ్:
సరాసరి వార్షిక వేతనం $97800. ప్రపంచంలో ఉపాధ్యాయులు అత్యధిక వేతనం పొందుతున్న దేశం లక్సెంబర్గ్. అమెరికా లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కంటే 2 రెట్లు అధిక వేతనాలు పొందుతున్నారు .

భారత దేశపు ఉపాధ్యాయుని సరాసరి వార్షిక వేతనం $10000 - $18000  మాత్రమే అని అనుకోవచ్చు .




మీరు 21 వ శతాబ్దపు ఉపాధ్యాయుడో కాదో తెలుసుకోవాలని ఉందా?

మీరు 21 వ  శతాబ్దపు టీచర్ అని తెలుసుకోవడమెలా?
 మీరు  క్రింద తెలిపిన విషయాలను పాటి స్తున్నట్లయితే   ఈ  నూతన శతాబ్దపు టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నరనుకోవచ్చు. అవి
1. మీ విద్యార్థులు తమ ప్రాజెక్ట్ పనులను ఇతర సుదూర ప్రాంత విద్యార్థులతో కలిపి చేయడం.
2.మీరు తయారు చేసిన lesson plans ని ప్రపంచం లోని ఇతర ఉపాధ్యాయులతో share చేసుకుంటున్నారా?

3.మీ బోధనకు అవసరమైన అనేక  వెబ్ రిసోర్సెస్ ని సేకరించి  వాటిని తరగతి గదిలో ఉపయోగిస్తున్నారా?
4. మీ professional devolopment లో భాగంగా  అనేక  టీచర్ బ్లాగ్ లను సందర్శించడం కాని, ఆన్లైన్ టీచర్ కమ్యూనిటీస్ తో కలవడం కాని చేస్తునారా?
5.మీ విద్యార్తుల గొప్పతనాన్ని ప్రపంచంతో (online ) share  చేసుకుంటున్నారా?
6.మీ విద్యార్థుల రిపోర్ట్స్ ని  వారానికొకసారైనా  మీ బ్లాగ్ ద్వారా విద్యార్తులకు వారి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారా?
7.విద్యార్తులు సోషల్ మీడియా ను వారి మంచి కోసం  ఉపయోగించుకొనేలా చేస్తున్నారా?

స్కూల్ అసెంబ్లీ ని ప్రతిభా వంతంగా నిర్వహించుకోవడం ఎలా?

  ఇప్పటికి మీ స్కూల్ అసెంబ్లీ నిర్వహణ ఒక మొక్కుబడి తంతులా నిర్వహిస్తున్నారా ? గబగబా  జనగణమన , గడగడమని వందేమాతరం   వల్లించడం , అదీ అప్పజేప్పినట్లుగా .... చివర్లో ప్లేడ్జ్  పలికించడం , తరవాత పొలోమని  ఎవరి క్లాసులకు  వారు వెళ్ళిపోవడం  ఇదే నిర్వహిస్తున్నారా?  స్కూల్ అసెంబ్లీ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఎప్పటికి ఇలా చేయరు.


మార్నింగ్ అసెంబ్లీ అంటే  ఉపాధ్యాయులు , విద్యార్తులు ,తల్లిదండ్రులు అందరూ కలసి నిర్భయత లోంచి  ఆ కొన్ని క్షణాలు ఒకే హృదయంగా , ఒకే ప్రపంచంగా , ఒకే ఊపిరిగా, ఒకే ఆవేదనగా , ఒకే ఆవేశంగా , ఒకే ఆనందంగా కలిసి స్పందించడం , కలిసి పాడడం,కలిసి నర్తించడం,కలిసి ఏడవడం, కలిసి నవ్వడం , కలిసి మాట్లాడడం , మౌనంలో కలిసి ధ్యానించడం .
అసెంబ్లీ లో సృజనాత్మకత అనుభవంలోకి రాగలిగితే , దాని ప్రభావం మూలంగా మిగితా పీరియడ్స్ లోకి ఆ ఉత్సాహం ఎలేక్ట్రిఫై  అయ్యి విద్యా విధానం మారే అవకాశం ఉంటుంది.
మార్నింగ్ అసెంబ్లీ లను  డిఫరెంట్ గా నిర్వహిస్తూ  ఆ క్షణాల్ని అనుభూతులుగా అందరిలో రంగరిస్తున్న  ఋషి వాలీ ,సుమవనం, శాంతి విధ్యావనం , విద్యార్ధి,  వికాస విద్యా వనం , వికాస భారతి , అభయ, శ్లోకా  వంటి  పాటశాలాల్నుంచి  మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.  వాళ్ళందరిలో మార్నింగ్ అసెంబ్లీ కార్యక్రమాల బ్లుప్రింట్ ఒకేలా లేవు.. ప్రతి వాళ్ళు  డిఫరెంట్ గా , ఎఫెక్టివ్ గా , సృజనాత్మకంగా ,అదీ ప్రతి రోజు వెనుకటి రోజుకు కార్బన్ కాపీ కాకుండా నిర్వహిస్తారు.
దీనిని బట్టి పాటశాల నిర్వాహకుల ప్రతిభ  ఆ పాటశాల అసెంబ్లీ నిర్వహణలో తెలిసిపోతుంది.
ఫ్రెండ్స్ మీ పాటశాల  అసెంబ్లీ లో ఈ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు  చేయండి అని  చెప్పడం కన్నా దాని ప్రాముఖ్యాత చెప్పడం  ద్వారా ఏమేమి నిర్వహించాలో అర్ధమయ్యే ఉంటుంది మీకు.

తరగతి గదిలో ఉపాద్యాయులు చేసే మూడు పెద్ద పొరపాట్లు

తరగతి గదిలో పాఠo భోదించాలని  ఉపాధ్యాయుడు సంసిద్దుడైన వేళ  తరగతి గది వాతావరణాన్ని చెడగోట్టేలా కొంత మంది విద్యార్తులు ప్రవర్తిస్తుంటారు. అటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు తమకు తెలియకుండానే 3 పెద్ద పొరపాట్లు చేస్తుంటారు.వీటిని వీలైనంతవరకు చేయకుండా ఉండటమే ఉత్తమమం. అవి

1. అయిష్టతను, కోపాన్ని వ్యక్తం చేయడం:

ఒక విద్యార్ధి తరగతిగదిని  disturb  చేస్తున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు తన అయిష్టతను , కోపాన్ని ప్రదర్శిస్తాడు. కాని ఈ రకమైన ప్రవర్తనను ఉపాధ్యాయుడు వ్యక్తపరచక పోవడం ఉత్తమం. విద్యార్ధి పట్ల కోపంగా చూడటం, తదేకంగా చూడటం , పళ్ళు కోరకడo  వంటి చేష్టలు తరగతి గది మొత్తాన్ని ఆ విద్యార్ధి పై కేంద్రీకరించేలా చేస్తుంది. తద్వారా ఆ అంశము  ఉపాధ్యాయునికి  విద్యార్థికి వ్యక్తిగత వైరములా మారే అవకాశము ఉంది. కాబట్టి వారి ప్రవర్తనను  blame  చేసే బదులు అటువంటి ప్రవర్తన ఇక ముందు చేయకుండా ఉండేలా వారినుండి మాట తీసుకోవాలి.

2.  విద్యార్ధి సమాధానము కొరకు వేచి చూడటం :

ఎక్కువమంది ఉపాధ్యాయులు  తరగతి గది వాతావరణాన్ని చెడగొట్టే విద్యార్థుల పట్ల కఠీనంగా వ్యవహరించి తర్వాత వారి సమాధానం కొరకు ఎదురు చూస్తారు . కాని విద్యార్ధి సమాధానం కొరకు ఎదురు చూడటం  సరియైన క్లాస్ రూమ్ మేనేజ్మెంట్  అనిపించుకోదని నా అభిప్రాయం. పైగా ఇది విద్యార్థితో వాదన జరగడానికి  దారి తీస్తుంది. విద్యార్ధి సమాధానం కొరకు ఎదురు చూసినపుడు ప్రతి విద్యార్ధి తాను చేసిన  పనిని సమర్ధించే అవకాశాన్ని ఉపాధ్యాయుడు కల్పించినట్లు అవుతుంది.తద్వారా విషయం ప్రక్కదారి పడుతుంది. ఇవన్ని సమయాన్ని వృధా చేస్తాయి.

3. టైం అయిపోయిందని చెప్పడం:

చాలా మంది ఉపాధ్యాయులు ( గతంలో నేను కూడా) విద్యార్థుల పరీక్షా

సమయంలోగాని  మరేదైనా వ్రాత అంశాలవిషయంలోగాని
టైంఅయిపోయిందని  విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి సందర్భాలలో వారికి కొంత అదనపు సమయం ఇస్తూనే  దాని వల్ల తాము ఎంత ఇబ్బంది పడుతున్నామనే విషయాన్ని వారికి వివరించాలి. ఇలా తెలియజేయడం వల్ల భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది.

conclusion:

తరగతి గది నిర్వహణలో  ఉపాధ్యాయునికి అనేక సమస్యలు ఎదురవుతాయి . అలాంటి వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలే తప్ప విద్యార్థులను నిందించడం,కోప్పడటం సరైనది కాదని  నా అభిప్రాయం.

విద్యార్థులకు ఒక కొత్త టాపిక్ పరిచయం చేయుటకు 5 ఉత్తమ మార్గాలు

     
     మనం ఒక థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నప్పుడు ముందుగానే ఆ సినిమా కథను తెలియజేస్తే/తెలిస్తే ఆ సినిమా  పట్ల  ఉన్న ఆసక్తి ఒక్క  సారిగా పోతుంది . నిజానికి  ఏ సినిమా  కూడా దానిలో ఉన్న కథను ముందుగా తెలియజేస్తూ ప్రారంభం కాదు . అదే విధంగా ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లోకి  అడుగు పెట్టగానే తాను చెప్పబోయే అంశాన్ని  ఏ విధమైన  ఆసక్తిని  కలిగించని రీతిలో ముందుగానే తెలియజేస్తే ఆ అంశం పట్ల విద్యార్థులు ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి  ఆసక్తిని కోల్పోకుండా ఒక  అంశాన్ని నూతనంగా విద్యార్థులకు పరిచయం చేయడానికి 5 ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి అవి
     1) ఆడియో లేదా వీడియో ద్వారా పరిచయం చేయటం :
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచం లో  ఆడియో లేదా వీడియోలు విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి సులభంగా ఉపయోదపదతాయి. మీరు చెప్పబోయే అంశానికి సంబంధించిన ఆడియో బుక్స్ ఇంటర్నెట్ లో లభిస్తాయి. ఒక వేళా లేకపోతే  సొంతంగా తయారు చేసైనా విద్యర్హ్తులకు వినిపించవచ్చు. దీని వలన వివిధ రకాలైన సౌండ్ ఎఫెక్ట్స్ ను విద్యార్థులకు అందించి వారి దృష్టిని ఆకర్షించవచ్చు.

     సంఘీక శాస్రం లో చారిత్రక నేపధ్యం ఉన్న అంశాన్ని బోధించాల్సి వచ్చినప్పుడు ఆ కాలానికి సంబంధించిన అంశాలతో కూడిన పాటను వీడియోను చూపించవచ్చు.వీడియో అనేది ఆడియో కంటే చాల శక్తి వంతమైన సాధనాలు. వీడియో లను  క్రింది విధముగా ఉపయోగించవచ్చు
i) భాష పుస్తకాల్ని ఒక కథను ప్రస్తవిన్చేటప్పుడు ఆ కథ రచయితకి సంబంధించిన వీడియో లు లేదా ఆ కథ కి సంబంధించిన వీడియోలు చూపడం
ii) YOTUBE ,BRAINPOP,BRAINPOP JR వంటి మాధ్యమంలో సైన్సు, మాథ్స్ లకి సంబంధిచిన అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి.వీటిని చూపుతూ నూతన అంశాలని ఆసక్తి కరంగా విద్యార్థులకు పరిచయం చేయవచ్చు.
2)చిత్రాలు / పిక్చర్స్ ,ఉదాహరణలు,మోడల్స్ ద్వారా పరిచయం చేయడం 
విద్యార్థులకు పరిచయం చేయబోయే నూతన అంశానికి సంబంధించిన దృశ్య రూపకలైన చిత్రాలు, ఉదాహరణలు,మోడల్స్ చూపడం ద్వారా ఆ  నూతన అంశాలను నేర్చుకునే  విధంగ వారి ఆలోచనను కలిగించవచ్చు . ఈ రకమైన విధానం సైన్సు మరియు సోషల్ సబ్జెక్టు లకు చాల ఉపయోగకరమైనది.
ఈ విజువల్స్ ని గోడల పై ప్రదర్శిస్తూ ప్రతి విజువల్ క్రింద స్టూడెంట్ యొక్క ప్రతి స్పందనను తెలుసుకొనుటకు కామెంట్స్ వ్రాసే విధంగా ఏర్పాటు చేస్తే వారికి ఆ అంశం పట్ల మరింత ఆశక్తి  కలిగించవచ్చు.
3) కవితలు , పద్యాల ద్వారా పరిచయం చేయడం ;
మీరు చెప్పబోయే అంశానికి సంబంధించిన కవితలు ,పద్యాలను సేకరించి వాటిని విద్యార్థులకు వినిపించడం ద్వారా కూడా ఆసక్తిని కలిగించవచ్చును .మీకు కావాల్సిన కవితలు పద్యాలు దొరకనప్పుడు మీరే సొంతంగా తయారుచేసి ప్రయత్నించవచ్చు.
పద్యాలను ఉపయోగిస్తున్నప్పుడు విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపు కి ఒక్కో పద్యం ఇచ్చి చదివించడం ద్వారా అందరు విద్యార్థులు ఆసక్తి గ పాల్గొనేల  చేయవచ్చు. భాష సంబంధం అయిన సబ్జెక్టు కు ఈ విధానం ద్వారా భాష చదివె నైపుణ్యం పెంచవచ్చు .
4) నాటక ప్రదర్శన ద్వారా:
చెప్పవలసిన అంశానికి తగిన కథను తయారు చేసి విద్యార్థులను దానిలో నటింప చేయడం ద్వారా విద్యార్థులలో ఆ అంశం నేర్చుకోవాలనే ఆసక్తిని ఎక్కువ కలిగించవచ్చు. విద్యార్తులు ఆ అంశం పట్ల ఆ అవగాహన పెంచుకున్నప్పుడే దానిలో నటిచగలడు కాబట్టి విద్యార్థులు ఆ అంశాన్ని శ్రద్ధగా నేర్చుకునటారు. ఇటువంటి ప్రదర్శనలు పుస్తక  పఠన లోటును తగ్గిస్తాయి .
5) ఒక సమస్యను ఇచ్చి సాదింప చేయడం ద్వారా ;
విద్యార్థులకు ముందుగా పాఠము వివరించిన తరువత సమస్యను సాధింప చేయడం కంటే ముందుగానే సమస్యను ఇచ్చి సాదించామనడం వలన వారి లో ఒక లాంటి ఆసక్తి  , చాలెంజింగ్ ధోరణి కలుగుతాయి,
ఉదాహరణకు జంతు వర్గీకరణ పాఠ౦ బోధించాలనుకున్నప్పుడు జంతు వర్గీకరణ గురించి తొలుత చెప్పి ఆ తరువాత  ఆ రకమైన  జంతువులను  గురించి చెప్పడం కంటే విద్యర్తులను గ్రూపులుగా వర్గీకరించి వారికి కొన్ని జంతువుల బొమ్మలు గల కార్డులను ఇచ్చి  వాటిలోని ఉమ్మడి లక్షణంఆధారంగా వర్గికరించమని చెప్పడం ద్వారా ఆ అంశాన్ని సమర్ధవంతంగా , ఆసక్తి కరంగా వారికి అందించవచ్చు.
.            Ø  గణితం లో ఒక పజిల్ ని ఇవ్వడం ద్వారా
Ø  ఇంగ్లీష్ లో  కొన్ని రకాల  బొమ్మలను ఇచ్చి  వాటి అర్ధాలు పదాలు ,స్పెల్లింగ్ తెలుపమనడం ద్వారా
ఈ విధంగా మీరు విద్యార్థులను ఎల్లప్పుడూ  సరికొత్త అంశాన్ని నేర్చుకునే దానికి ఆసక్తి  ఉండేలా  మార్చండి. మరిన్ని సలహాలు సూచనలను కామెంట్ బాక్స్ లో  వ్రాయగలరు


         


కాని ప్రస్తుతమున్న గణిత పుస్తకం ఏదైనా E-L-P-S  లోని P-S  అంశాలనే కలిగి ఉంటాయి. కాని విద్యార్థికి అవసరమైన E-L లేకుండా గణిత బోధన  సాధ్యం కాదు. గణిత ఉపాధ్యాయుడిగా విద్యార్థికి E-L  ని కూడా అందించినపుడే విద్యార్థులను గణిత మేదావులుగా తీర్చి దిద్దవచ్చు .

ప్రపంచం లో అత్యుత్తమ విద్యా వ్యవస్థ ఎక్కడ ఉందొ తెలుసా?

ప్రపంచం లో అత్యుత్తమ విద్యా వ్యవస్థగా పేరుగాంచినది  Finland Education system.  ఎందుకు  ఈ  దేశపు విద్యా వ్యవస్థ  సక్సెస్స్ అయిందో  తెలిస్తే  మీరు షాక్ అవుతారు.  Findland  దేశానికి వెళితే బాగుండు అని అనేపించెంతలా  వారి విద్యా వ్యవస్థ ఉంటుంది. వారి విద్యా వ్యవస్థ లోని క్రింది అంశాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్ధం అవుతుంది.
1. Finland లో విద్యార్తులు స్కూల్ లాంటి వాతావరణం లో గడిపే సమయం తక్కువ :
 ఈ దేశం లో పిల్లవాడికి 7 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తప్పనిసరిగా  PLAYWAY METHOD లోనే అనేక అంశాలను నేర్పుతారు . ఆ తరువాతనే పాటశాలలో  జాయిన్ చేస్తారు.  ఈ పాటశాల విద్య కేవలం  9 సంవత్సరాలు మాత్రమె ఉంటుంది . దీని తర్వాత  వారికీ మూడు మార్గాలు సూచించబడ్డాయి . మొదటిది సెకండరీ విద్య , రెండవది వొకేషనల్ విద్య కాగా మూడవది  ఏదైనా WORK లో జాయిన్ కావడం. వీటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది విద్యార్తుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది తప్ప ఇతరుల ప్రభావం ఉండదు.
2. స్కూల్ పనిచేసే సమయం కూడా తక్కువ:
Finland లో  పాటశాలలు  ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 వరకు  మాత్రమె పనిచేస్తాయి . అనగా రోజుకు సరాసరి 3 నుండి 4 పీరియడ్స్ మాత్రమె జరుగుతాయి. మరియు పీరియడ్ పీరియడ్ కి మధ్య  break time  కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఉపాధ్యాయులు మరియు విద్యార్తులు ఎక్కువగా అలసిపోకుండా వారి సామర్ధ్యానికి అనుగుణంగా నేర్చుకునే అవకాశం కల్పించబడింది.
3. ఉపాధ్యాయులకు   సరియన ప్రణాళిక తయారు చేసుకునే స్వేచ్చ:
ఒక Finland ఉపాధ్యాయుడు సంవత్సరానికి సరాసరిన  600 గంటలు మాత్రమే తరగతి గది లో పనిచేస్తాడు . కాని ఒక U.S  ఉపాధ్యాయుడు    1080 గంటలు , ఒక  భారతీయ ఉపాధ్యాయుడు 1760 గంటలు సరాసరిన సంవత్సరానికి పనిచేస్తాడు.  అంతే కాకుండా Finland  ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు పాటశాలలో ఉండవలసిన పని లేదు . కేవలం వారి పీరియడ్ సమయంలో పాటశాలలో ఉంటె సరిపోతుంది . ఇలాంటి స్వేచ్చ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులు మరిన్ని నూతన  ప్రణాళిక  తయారుచేసుకొని బోధించే అవకాశం కల్పించబడింది .
4. ఉపాధ్యాయ బదిలీలల్లో చక్కటి విధానం :
Finland విద్యార్తులు తమ స్కూల్ లైఫ్ లో  దాదాపు ఒకే టీచర్స్ ని చూస్తారు ఎందుకంటే ఉపాధ్యాయులు దాదాపు ఒక స్కూల్ లో 6 సంవత్సరాలవరకు పనిచేస్తారు . అందుకే విద్యార్తుల గురించి వారికి పూర్తి అవగాహన ఉంటుంది.
5. ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు పూర్తి నమ్మకం ఉంచడం :
ఇక్కడ ఉపాధ్యాయులకు , విద్యార్తుల తల్లిదండ్రులకు మధ్య చక్కని సంబంధాలు ఉన్నప్పటికీ వారు ఉపాధ్యాయులపై  పూర్తి నమ్మకం వుంచి  వారి బోధనలో తలదూర్చరు. దీనికి కారణం లేకపోలేదు , అక్కడ ప్రాధమిక ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం 20 శాతం మించదు . మరియు ప్రతి ఉపాధ్యాయునికి తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీ ని కలిగి ఉండాలి . దీని బట్టి అక్కడి టీచర్ ల క్వాలిటీ అర్ధం చేసుకోవచ్చు.
6. ఉపాధ్యాయులకు అదనపు సౌకర్యాలు:
Finland Education system లో ప్రతి ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా ఓక గది ఉంటుంది . దానిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడతాయి.  చక్కటి ఫర్నిచర్ మరియు టీ , కాఫీ లాంటి సౌకర్యాలు ఇందులో కల్పించ బడతాయి.
తద్వారా ఉపాధ్యాయుడు బోధనను సమర్దవంతముగా నిర్వహించే అవకాశం ఉంది .
7. పరీక్షల పై కన్నా బోధనపైనే దృష్టి ఎక్కువ:
వీరి విద్యా వ్యవస్థలో పరీక్షలు నామమాత్రం గా ఉంటాయి. ఎక్కువగా వీరు currriculam బోధించడం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. పరీక్షల పేరుతో  విధ్యార్తులను విసిగించరు. ఉపాధ్యాయులు విద్యార్తులకు కొత్త కొత్త టెక్నిక్ లతో బోధించుటకు , లైఫ్ స్కిల్ల్స్ నేర్పించుటకు స్వేచ్చ ఉంది.
8. చాల తక్కువ హోం వర్క్ :
ప్రపంచంలో అత్యంత తక్కువ హోంవర్క్ ఉండే విద్యా వ్యవస్థ ఇదే. సరాసరిన రోజుకు అరగంట కంటే ఎక్కువ హోం వర్క్ ఉండదు. స్టూడెంట్స్ ఎక్కువగా learning by doing ద్వారా క్లాసు లోనే నేర్చుకుంటారు. ప్రతి విద్యార్ధి తరగతి సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడడు. ప్రతి విద్యార్తి పై ఉపాధ్యాయుడు శ్రద్దను చూపుతాడు దీనికి కారణం వారు రోజుకు 60-80 కంటే ఎక్కువ మంది విద్యార్తులకు బోధనా ఉండదు.
9. తక్కువ సిలబస్  కలిగి ఉండటం.:
ఇక్కడ ఉపాధ్యాయులు తక్కువ సిలబస్ ని ఎక్కువ కాలం పాటు చక్కగా వివరిస్తారు . అంతే కాని విద్యార్తుల పై  అధిక సిలబస్ బారం మోపరు.
conclusion: ఎక్కడయితే  ఉపాధ్యాయులు మరియు విద్యార్తులకు స్వేచ్చ ఉంటుందో అక్కడ విద్యావ్యవస్థ బాగుంటుంది అనడానికీ ఫిన్లాండ్ ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు .









this matter has been taken from www.localtips2016.com
thaks for localtips team

                  committees in school&పాఠశాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు*

©💞®🌹


బాలల సంఘాలు*
బాలల సంఘాలు అంటే బాలలతో ఏర్పరిచే సంఘాలే!
 విద్యార్ధులే పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని బాధ్యత వహించడానికి బాలల సంఘాలు ఉపయోగపడతాయి.

ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలి. ప్రధానోపాధ్యాయుడు మానిటరింగ్‌ చేయాలి.
 పాఠశాల స్థాయిలో ఈ క్రింది కమిటీలు విధిగా తమ విధులను నిర్వహించాలి. 
ప్రతి కమిటీలో తరగతికి ఒక్కరు చొప్పున అయిదుగురు ఉంటారు.

🅾1. *సమాచార కమిటీ:*

బడిమానివేసిన / తరచు గైర్హాజరపుతున్న పిల్లల వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు అందజేయుట. ప్రార్ధనా సమావేశాలలో ప్రతి రోజు వార్తలు చదవడం.

✳2. *ఆరోగ్య / పరిశుభ్రత కమిటీ*:

పిల్లల పరిశుభ్రతను పరిశీలించడం, తరగతి గదిలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం, వ్యాధుల పట్ల అవగాహన కలిగించుట.

✴3. *ఆటలు / సాంస్కృతిక కమిటీ:*

కాలనిర్ణయ పట్టిక ప్రకారం ఆటలు ఆడేలా చూడడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో పాల్గొనడం.

🛄4. *గోడ పత్రిక కమిటి*

ప్రతి రోజు పిల్లలు, టీచర్లు, రాసిన లేక తెచ్చిన కార్టూన్లు, కవితలు మొదలయిన ఇతర సమాచారం గీసిన బొమ్మలను గోడపత్రికలో ఉంచడం.

🔵5. *గ్రంథాలయ కమిటీ:*

ప్రతిరోజు రీడింగ్‌ సమయంలో పిల్లలకు పుస్తకాలిచ్చి వాటి వివరాలను నమోదు చేయడం, పఠన సామగ్రిని సేకరించడం.

🔯6. *మధ్యాహ్న భోజన కమిటీ:*

ప్రతి పాఠశాల నుండి తరగతికి ఇద్దరి చొప్పున విద్యార్ధులను ఎంపిక చేసి మధ్యాహ్న భోజన కమిటీ ఏర్పాటు చేసి వారి పేర్లు ప్రదర్శించాలి.
ఈ కమిటీకి చైర్మన్‌గా ప్రధానోపాధ్యాయులు పి. ఇ .టి / ఆసక్తికరమైన ఉపాధ్యాయుడు ఇన్‌చార్జీగా ఉంటారు.
మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు, మెను ప్రకారం భోజనం తయారు చేస్తున్నారా, రుచికరంగా, శుభ్రంగా ఉంటుందా చూడాలి.
మధ్యాహ్న భోజన సమయంలో తరగతి వారీగా విద్యార్ధులను వరుసలలో నిలబెట్టి వారి ప్లేట్లు కడుక్కోనేటట్లు చూడాలి.
తరగతి వారీగా భోజనం అందించి కూర్చోనిబెట్టాలి.
 అల్లరి కాకుండా చూడాలి.
పాఠశాల / తరగతి ఆవరణ శుభ్రంగా ఉండునట్లు Dust Bins ఉపయోగించునట్లు విద్యార్ధులకు అవగాహన కల్పించాలి.
వారికి తాగు నీటి వసతి అందునట్లు చూడాలి.
విద్యార్ధులందరు తిన్న తర్వాత, మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు తినాలి.
మాస వారీగా సమీ క్షించుకోవాలి. 
సమీ క్షలో తీసుకొన్న నిర్ణయాలు అమలగునట్లు చూడాలి

🕉7. *పాఠశాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు*

⭕🅾 *ఉద్దేశ్యం*

పిల్లల్లోని బహుముఖ ప్రతిభను వెలికితీయడానికి, మంచి వైఖరులను నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి పిల్లల్లో సహకారం, సంఘీభావం కలిసి పనిచేయడం తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం, స్నేహభావం, స్వీయ క్రమశిక్షణ అలవర్చడం కోసం.

 ❇ 1. *ప్రార్ధన:*

🔹పిల్లలచే స్వల్ప వ్యాయామ కృత్యాల నిర్వహణప్రార్ధన గీతాన్ని శ్రావ్యంగా, రాగభావయుక్తంగా, సామూహికంగా పాడించాలి.
🔹రాష్ట్ర గీతం, ప్రతిజ్ఞను నిర్వహింపజేయాలి.
🔹సేకరించిన నేటి వార్తలు చదివించాలి.
🔹ఒక మంచి మాట (సూక్తి) చెప్పించాలి.
🔹నేటి ప్రశ్న - మీ సమాధానంలో ప్రశ్నను అడగాలి.
🔹బాలల సంఘాలచే పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలింపజేయాలి. తగు సూచనలు అందజేయాలి.
🔹ప్రాముఖ్యత గల రోజులల్లో ఆ రోజుకు సంబంధించిన సూచనలు అందజేయాలి.
🔹పిల్లల డైరీ, గోడపత్రిక, స్కూల్‌ పోస్టు బాక్స్‌లోని మంచి ఉత్తరాలు రాసిన, మంచి అంశాలు ప్రదర్శించిన పిల్లలను అభినందించాలి, ప్రోత్సహించాలి.

📚2. *తరగతి గది గ్రంథాలయం:*

పిల్లల అభిరుచికి తగినట్లుగా కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గేయాలు, సమాచార సాహిత్యం పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి చదివించాలి. పిల్లలతో వారు చదివిన పుస్తకాలపై సమీ క్షలు రాయించాలి.

📕3. *పిల్లల డైరీ:*

పిల్లలు తమ ఆలోచనలు, ఇష్టాయిష్టాలను క్రమ పద్ధతిలో వ్యక్తీకరించే పుస్తకం. పిల్లల సహజ స్పందనలు అక్షర రూపంలో పొందేందుకై డైరీ ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉపాధ్యాయుడు డైరీలను పరిశీలించాలి.

⚪4. *గోడ పత్రిక:*

పిల్లలు అభిప్రాయాలను వ్యక్తం చేయటం వారి హక్కు. గోడ పత్రిక వారి ఆలోచనలు, అనుభూతులు, అభిప్రాయాలు, అభిప్రాయాలు, స్పందనలు వెలిబుచ్చే అవకాశం, వాతావరణం కలిగించేదిగా ఉంటుంది. కవితలు, గేయాలు, సూక్తులు, వార్తలు, కార్టూన్లు, వ్యాసాలు, జోక్స్‌, బొమ్మలు, తెలిసిన, రాసిన లేదా సేకరించిన సమాచారం మొదలైనవి ప్రదర్శించాలి. ప్రతి వారం గోడపత్రికలోని అంశాలను మార్చుతూ ఉండాలి.

🛄5. *స్కూల్‌ పోస్ట్ బాక్స్:*

పిల్లలు తమ అభిప్రాయాలను, సందేహాలను సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వేదిక పోస్టుబాక్స్ స్కూల్‌ పోస్టు బాక్స్ లోని అంశాలను ఉదయం ప్రార్ధన సమావేశంలో చదివి తోటి విద్యార్ధులకు వినిపించాలి

✴6. *మేళాల నిర్వహణ:*

తెలుగు, గణిత, విజ్ఞానశాస్త్ర అంశాలకు చెందిన కృత్య సామగ్రిని, ప్రయోగాలను ఒక చోట చేర్చే ప్రదర్శించే వేదిక ఈ కార్యక్రమం ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు సమాజ సభ్యులకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్గించే కార్యక్రమం, ప్రతి విద్యా సంవత్సరము కనీసం ఒకసారి నిర్వహించాలి

💥7. *ఆవాస ప్రాంత కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేయటం:*

ప్రతి పాఠశాల సిక్స్, కనిష్ట, గరిష్ట ఉష్ణమాపకాన్ని వినియోగించి పాఠశాల ప్రార్థన సమయంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు చదవాలి. ఒక చార్టులో రోజు వారీగా ఉష్ణోగ్రతలు నమోదు చేసి వాటిని తరగతిలో విశ్లేషించాలి

🅾8. *వర్షపాతం నమోదు చేయటం:*

ప్రతి పాఠశాల “వర్షమాపిణి’’ లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌లో రూపొందించిన వర్షమాపణి ద్వారా వర్షపడిన సందర్భాలో వర్షపాత వివరాలు చార్టుపై నమోదు చేయాలి. నెల వారీగా వర్షం పడిన రోజులు, ఎన్ని సెం. మీ వర్షం కురిసిందో వాటి వివరాలను విశ్లేషించాలి. ప్రతి నెల ఒక రోజు ఉదయం ప్రార్ధన సమావేశంలో వాటిపై చర్చించాలి

✡9. *వివిధ కాలాలలో వచ్చే వ్యాధులు, వ్యాధులకు గురయిన వారి సంఖ్య నమోదు చేయటం:*

ఆవాస ప్రాంతంలోని విద్యార్ధులకు వివిధ కాలాలలో వచ్చే వ్యాధులు, వ్యాధికి గురైన విద్యార్ధుల సంఖ్య వివరాలు ప్రతి నెల నమోదు చేయాలి. వాటి వివరాలు స మీ పంలోని ఆరోగ్య కార్యకర్తకు / అందజేసి తిరిగి ఆయా వ్యాధులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలపై అవగాహన కలిగించాలి

🔵10. *కంపోస్టు, ఇంకుడు గుంత నిర్వహణ:*

ప్రతి పాఠశాలలో ఒక మూలలో కంపోస్టు గుంత ఏర్పాటు చేయాలి. రాలిన ఆకులు, మధ్యాహ్న భోజన వ్యర్థ పదార్థాలు వాటిలో వేయాలి. మట్టి, నీరు వినియోగించి కంపోస్టు ఎరువు తయారు చేయాలి.

⏺11. *ప్లాస్టిక్‌, థర్మకోల్‌ వినియోగించకపోవటం:*

పాఠశాలలో ప్లాస్టిక్‌, ధర్మకోల్‌తో తయారు చేసిన వస్తువులను వాడరాదు. పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్‌ కాగితాలు వాడటం, పారవేయటం చేయరాదు. ప్లాస్టిక్‌ గ్లాసులలో టీ, నీరు తాగటం చేయరాదు. పాఠశాల బయట “ప్లాస్టిక్‌ థర్మకోల్‌ రహిత పాఠశాల’’ అనే బోర్డు ప్రదర్శించాలి

⭕12. *నిజాయితీ పెట్టె:*

నిజాయితీ పెట్టె ద్వారా ఇతరుల వస్తువులు పిల్లలు తీసుకోకుండా, సంబంధిత వ్యక్తులకు అందజేసే పని జరుగుతుంది. ఏవైనా వస్తువులు నిజాయితీ పెట్టెలో ఉన్నపుడు ఉదయం పూట ప్రార్థన సమావేశంలో అందరి ముందు సంబంధిత వ్యక్తులకు అందచేయటంతో పాటు అవి నిజాయితీ పెట్టెలో వేసిన విద్యార్ధి వివరాలు తెలిపి అతని / ఆమె చర్యను అభినందించాలి.

🍀13. *పర్యావరణ - మిత్ర:*

పాఠశాల పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉండటానికి పర్యావరణ మిత్ర బాధ్యత వహిస్తుంది. కమిటీకి ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, ఒక ఉపాధ్యాయుడు కన్వీనర్‌గా పనిచేస్తారు. ప్రతి తరగతి నుండి ఒక విద్యార్థిని ఎన్నుకోవాలి. ప్రతి తరగతిలో చెత్తబుట్ట ఏర్పాటు, పాఠశాల ఆవరణ, గదులు శుభ్రంగా ఉండేటట్లు చూడటం, మొక్కల పెంపకం, పక్షులు, జంతువులకు నీరు తాగటానికి తొట్టి, తినడానికి గింజల ఏర్పాటు, నీటిని వృధా చేయకుండా చూడటం వీ రి బాధ్యతలు.

✳14. *“విందాం-నేర్చుకుందాం’’ రేడియో పాఠాలను విన్పించడం:*

పాఠశాలలో రేడియో ఉందో లేదా చూడాలి. అది పని చేస్తుందో లేదో పరిశీలించాలి.పాఠశాలలో రేడియో పాఠాల షెడ్యూల్‌ అందుబాటులో ఉండాలి.పాఠశాలలో రేడియో పాఠాలు షెడ్యూల్‌ ప్రకారం పిల్లలకు వినిపించాలి.ఏ రోజు ఏ పాఠం వినిపించారో, ఒక నోట్‌ పుస్తకంలో వివరాలు రాయాలి.రేడియో పాఠాలను విన్నారో, లేదో పిల్లలను కూడా ప్రశ్నించి తెల్సుకోవాలి🌷